SSC New Model Question Papers 2021-22

SYLLABUS AND SSC EXAMINATION 2021-22




    @ పదో తరగతి ప్రశ్నపత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 11 పేపర్లను ఆరింటికి కుదించింది. పరీక్ష సమయాన్ని కూడా అరగంట పెంచింది. ఇది వరకు విద్యార్థులకు ఒక్కో పేపర్‌కు 2.45 గంటలు ఉండగా.. ఈ ఏడాది 3.15 గంటలకు సమయాన్ని పెంచింది.

    @ ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది ఫిబ్రవరి మూడోతేదీన జారీచేసిన మెమో -777 ప్రకారమే 2021-22 ఎస్సెస్సీ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 70% సిలబస్‌కే పరీక్షలను నిర్వహించనున్నారు. 30% సిలబస్‌ను తగ్గిస్తూ మరో మెమో జారీచేశారు. 

    @ 2020-21లో అమలుచేసిన సిలబస్‌నే 2021-22 విద్యాసంవత్సరంలోనూ అమలుచేస్తామని పేర్కొన్నారు. మార్కుల విధానంలో మార్పులు లేకపోగా.. 80 మార్కులకు వార్షిక పరీక్షలు, 20 మార్కులకు ఇంటర్నల్స్‌ ఉంటాయి.

    @  కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతేడాదే ఈ నిర్ణయాలను తీసుకోగా.. కరోనా సెకం డ్‌ వేవ్‌ నేపథ్యంలో అమలు కాలేదు. వాటినే ఈ విద్యాసంవత్సరం అమలుచేయనున్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తిషెడ్యూల్‌ డిసెంబర్‌లో విడుదలచేసే అవకాశాలున్నాయి.

    @ సైన్స్‌లో రెండు..: అన్ని సబ్జెక్ట్‌లకు ఒకే సమాధాన పత్రాన్ని ఇవ్వనుండగా, ఒక్క సైన్స్‌ పేపర్‌కు మాత్రం రెండు జవాబు పత్రాలు ఇస్తారు. మొదట భౌతిక రసాయనశాస్త్రం పేపర్‌కు జవాబులు రాసిన తర్వాత, విద్యార్థి చివరి గంటన్నరకుపైగా సమయంలో జీవశాస్త్రం పేపర్‌కు జవాబులు రాయాల్సి ఉంటుంది.


    @ రెండోభాషగా ఉర్దూ.. : ఈ విద్యాసంవత్సరం ఎస్సెస్సీలో ఉర్దూ ను రెండోభాషగా చేర్చారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలే రెండోభాషగా ఉండగా.. తాజాగా ఉర్దూను చేర్చారు. ఈ నిర్ణయంతో మొదటిభాషగా తెలుగు, హిందీల్లో ఒక దానిని తీసుకున్న విద్యార్థి రెండోభాషగా ఉర్దూ ఎంచుకోవచ్చు. ఉర్దూను ప్రథమ భాషగా తీసుకొంటే తెలుగు లేదా హిందీ ద్వితీయభాషగా తీసుకోవచ్చు.



 SSC Examination 2021-22

( Subject wise Model Question Papers) 
    
    @    Telugu

    @    Hindi

    @    English

    @    Maths TM              Maths EM

    @    Phy.Sci TM            Phy.Sci EM

    @    Bio.Sci  TM            Bio.Sci  EM

    @    Social  TM             Social  EM


Class wise Reduced Syllabus

    
    @    Class 1

    @    Class 2

    @    Class 3

    @    Class 4

    @    Class 5

    @    Class 6

    @    Class 7

    @    Class 8

    @    Class 9

    @    Class 10

DOWNLOAD :