Read Programme



100 రోజుల READ  క్యాంపెయిన్ పై  సూచనలు:

సమస్త మండల విద్యాధికారులకు,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,URS/KGBV  ప్రత్యేక అధికారులకు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు తెలియజేయునది ఏమనగా,

 🔹సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ గారు

 ▪️పాఠశాలలోని పూర్వ ప్రాథమిక  తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు  

▪️తేదీ 05.02. 2022 నుండి 100 రోజుల పాటు పఠన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. 

▪️విద్యార్థుల్లో స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటును పెంచడానికి, వారిలో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి మరియు విమర్శనాత్మక ఆలోచనలు కలిగించడానికి పఠనం ద్వారా భాషా మరియు నైపుణ్యం పెరగడానికి కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుంది.  పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలి.

 👉ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ధారాళంగా చదవగలగాలి. విద్యార్థులకు చదవడం ఒక అలవాటుగా మారాలి మరియు విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి.

▪️అందువలన ఈ కార్యక్రమమును క్రింది సూచనలతో ఖచ్చితంగా అన్ని పాఠశాలలలో నిర్వహించాలి. 

 👉విద్యార్థులకు పుస్తకాలు చదవడానికి ఒక పీరియడు కేటాయించాలి.

 👉పాఠశాల ఆవరణలో ఫ్లెక్సీ గాని పెయింటింగ్ గాని చార్ట్ పై గాని READ PROGRAMME గురించి ప్రదర్శించాలి.

👉 చదువు- ఆనందించు-అభివృద్ధి చెందు  అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.

👉 పాఠశాలలోని పుస్తకములను వర్గీకరించి తరగతుల వారీగా ప్రదర్శింప చేయాలి.

👉 తరగతి వారీగా విద్యార్థులచే  గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేయాలి. (ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతుల నుంచి ఐదుగురు విద్యార్థులతో గ్రంథాల కమిటీ ఏర్పాటు చేయాలి)

👉పాఠశాలలో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి.

👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.

👉 ఈ కార్యక్రమ నిర్వహణకు ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఎన్జీవోలను, సమాజ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి.

👉 ఇంటివద్ద చదవటానికి ప్రోత్సహించాలి.

👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించాలి.

👉ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయాలి.  

👉నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి 14 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 

👉ప్రధానోపాధ్యాయులు  ఈ కార్యక్రమంలో భాగంగా  విద్యార్థి వారిగా  వారి ప్రగతిని  రికార్డు  చేస్తూ మరియు సమీక్షిస్తూ   పనితీరు మెరుగుదలకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సూచనలు చేయవలెను .

 👉ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రధానమైనదిగా భావించ వలెను.

👉మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ తమ మండలంలో,స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో  క్రమం తప్పక మానిటరింగ్ చేస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించడం అయినది.

 పఠనానికి మార్గదర్శకాలివే…

@    గ్రంథాలయ పుస్తకాలు చదివేందుకు ప్రతిరోజూ ఒక పీరియడ్‌ కేటాయించాలి. మూడురోజులు మాతృభాషలో, రెండురోజులు ఆంగ్లభాషలో, ఒకరోజు ద్వితీయభాషలోని కథల పుస్తకాలను చదివించాలి.

@    ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థులతో, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి తొమ్మితో తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేయాలి.

@    వారికి ఆసక్తి కలిగిన పుస్తకాలు చదివేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఇంటి దగ్గర సైతం ఆ పుస్తకాలు చదివించేలా కృషి చేయాలి.

@    ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహించాలి. కథలు చెప్పించడం, చదివిన దాని గురించి మాట్లాడించడం వంటి పోటీలతో విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంచాలి.

@    నెలకు ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ సభ్యులను పాఠశాలలకు ఆహ్వానించాలి. వారి నేతృత్వంలో విజేతలకు బహుమతులు అందజేయాలి.

@    రూమ్‌ టు రీడ్‌, సేవ్‌ ద చిల్డ్రన్‌, యూనిసెఫ్‌, బ్రెడ్‌ వంటి స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

@    అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి. 21న అన్ని పాఠశాలల్లో మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలి.

@    మండలస్థాయిలో ఎంఈవో ఐదుగురు విషయ నిపుణులతో కోర్‌ టీంను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ వారానికి ఒక సారి పఠనాభివృద్ధి నివేదికను డీఈవోకు సమర్పించాలి.

@    జిల్లాలోని సెక్టోరల్‌ ఆఫీసర్లకు మండలాలవారీగా బాధ్యతలు అప్పగించాలి. జిల్లాస్థాయిలో DEO ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, సూచనలు, సలహాలు ఇవ్వాలి.

@    ఆయా గ్రామాల్లో విరాళాలు ఇచ్చేవారిని ప్రోత్సహించాలి. ఆ నిధులతో పఠనాభివృద్ధి కార్యక్రమాన్ని పటిష్ఠం చేయాలి.



DOWNLOAD :